భ‌న్వ‌ర్‌లాల్‌ను క‌ల‌సిన తెలుగుదేశం నేత‌లు

cec banwarlal
cec banwarlal

హైదరాబాద్‌: సాక్షి టీవీలో ఎన్నికల గుర్తులను ప్రసారం చేస్తున్నారని పేర్కొంటూ తెలుగుదేశం నేతలు
కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, పల్లె రఘునాథరెడ్డిలు ఎన్నికల సంఘం చీఫ్‌ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు
చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేస్తున్న సాక్షి మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
వారు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లె రఘునాథరెడ్డి సీఎం సీట్లో కూర్చోవడం, లక్ష కోట్లను
కాపాడుకోవడంపైనే జగన్‌ ధ్యాసంతా ఉందని, ప్రజల సంక్షేమం జగన్‌కు అవసరం లేదని, ముఖ్యమంత్రి
చంద్రబాబు చేస్తున్న మంచి పనులను..యాజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు జగన్‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు.
జీవితకాలంలో ఎప్పటికీ జగన్‌ ముఖ్యమంత్రి కాలేడని ఆయన విమర్శించారు.