భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు

bagamati express
bagamati express

భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించాయి. దర్బంగా నుంచి మైసూర్ వెళ్తున్న కాజీపేట- డోర్నకల్ జంక్షన్ పరిధిలోని కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. అక్కడ సుమారు 10 నిమిషాల పాటు నిలిపిన అనంతరం రైలును కేసముద్రం స్టేషన్‌కు తీసుకొచ్చారు. బోగీలోని ఫ్యాన్‌కు ఇచ్చే కనెక్షన్ వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దాదాపు 30 నిమిషాల పాటు మరమ్మతులు చేసిన పిదప రైలు అక్కడ నుంచి వెళ్లిపోయింది.