బ్యారేజీ వద్ద సైకిల్‌ ర్యాలీ

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద డీజీపీ సాంబశివరావు సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపే లక్ష్యంగా పారామిలిటరీ, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా తిరుపతి వరకు సైకిల్‌ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఐదు రోజుల యాత్రలో సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాజధానిలో తొలిసారిగా ఈ తరహా ర్యాలీ ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ఇలాంటి ర్యాలీ నిర్వహించడం గొప్ప విషయమని డీజీపీ కొనియాడారు.