బిసి గర్జన పేరుతో టిడిపి భారీ బహిరంగసభ

KALA VENKATARAO
KALA VENKATARAO

కాకినాడ: రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపిను ఏపి ప్రజలు ఎలా నమ్ముతారని ఏపి టిడిపి అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆ పార్టీకి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదని, బిజెపికి ఓట్లేస్తే వృథా ప్రయాసేనని వ్యాఖ్యానించారు. తూ.గో.జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ..అక్టోబరు నెలాఖరున తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బిసి గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.