బిజెపి నుంచి తప్పుకున్న ఆకుల

a sathyanarayana
a sathyanarayana

అమరావతి: ఏపి బిజెపికి ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజమండ్రి అర్బన్‌ పార్టీకి రాజీనామా చేసి, ఆ లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అందజేశారు. ప్రస్తుతం ఏపి బిజెపిలో తెలత్తిన వివాదాలు తనకు రుచించడం లేదని , కన్నాకు పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఐతే ఆకుల జనసేనలో చేరుతున్నట్టు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.