బిజెపిలో నా భార్య త‌ప్ప‌, నేను లేను

D PURADHESWARI, VENKATESWARA RAO
D PURADHESWARI, VENKATESWARA RAO

అమ‌రావ‌తిః త‌న‌ భార్య పురందేశ్వరి మాత్రమే బీజేపీలో ఉన్నారని… తాను ఆ పార్టీలో లేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని… తనకు ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. ఈ కాలంలో తెలంగాణ పోరాటంపై ఓ పుస్తకం రాశానని తెలిపారు. గతంలో రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఎంతో మందిని కలవలేక పోయానని… ఇప్పుడు అందరినీ కలుస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.