బాలాజీని దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

narasimhan visit tirumala
narasimhan visit tirumala

తిరుమల: తిరుమలలో వేంచేసివున్న బాలాజీని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు.
ఈ రోజు ఉదయం వీఐపి దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న నరసింహన్‌ దంపతులకు ఆలయ అర్చకులు
స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు గవర్నర్‌ను శేష వస్త్రంతో సత్కరించి, తీర్ధప్రసాదాలు అందజేశారు.