బాపట్లలో ఎక్సైజ్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

Suspended
Suspended

గుంటూరు: బాపట్లలో ఎక్సైజ్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ కార్యాలయంలో మద్యం సేవిస్తూ పట్టుబడిన సిబ్బందిపై ఎక్సైజ్‌శాఖ డిసి శ్రీమన్నారాయణ సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెండైన వారిలో ఎస్‌ఐ రవికుమార్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రావు, రహతుల్లా ఉఆన్నరు. తక్కిన వారిని మందలించి వదిలేశార. మద్యం నియంత్రించాల్సిన అధికారులే పట్టపగలు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటంపై ఉన్నతాధికారులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.