ప‌వ‌న్ దీక్ష‌కు వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తు

PAWAN KALYAN STRIKE
PAWAN KALYAN STRIKE

శ్రీకాకుళంః ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు దీక్ష ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో కొనసాగుతోంది. ఈ దీక్షకు వామపక్ష నేతలు మధు, రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో 20 ఏళ్లలో 60 వేల మంది కిడ్నీ బాధితులు చనిపోయారని మధు, రామకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇసుక, మైనింగ్‌, మద్యం.. ఇలా అన్నింట్లో మంత్రులు కమీషన్లు నొక్కుతున్నారని విమర్శించారు. అందుకోసమే రాష్ట్రానికి కొత్త రాజకీయాలు కావాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ పోరాట యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారు. టీడీపీకి పోయే కాలం దగ్గర పడిందని మధు, రామకృష్ణ ధ్వజమెత్తారు.