ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

goods train accident in guntakal
goods train accident in guntakal

గుంత‌క‌ల్లుః పట్టణ సమీపంలోని వెస్టు గుంతకల్లు రైల్వే సైడింగ్‌లోని యార్డులో మంగళవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వేకి తీవ్ర నష్టం వాటిల్లింది. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బిలాయ్‌ ఇనుము, ఉక్కు కర్మాగారం నుంచి కర్ణాటకలోని హుబ్లీకి రైలు కమ్మీలను తీసుకెళ్తున్న ఓ సరుకు రవాణా రైలు వెస్టు గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోని యార్డులో పట్టాలు తప్పింది. ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పగా ట్రాక్‌ భారీగా దెబ్బతింది. వ్యాగన్లు కూడా ధ్వంసమయ్యాయి. వ్యాగన్లలోని క మ్మీలకు వెల్డింగ్‌ చేయటంతో అవి చెక్కుచె దరలేదు. వ్యాగన్లు భారీ లోడుతో ఉండటం తో వాటిని అన్‌లోడ్‌ చేస్తేగానీ మరమ్మతులు చేయలేని పరిస్థితి తలెత్తింది. భారీ క్రేన్లను తె ప్పించి, వ్యాగన్లలోని ఇనుప కమ్మీలను అన్‌ లోడ్‌ చేయించి రైలు పట్టాలకు మరమ్మతు లు చేసి, గూడ్సు రైలును పట్టాలపైకి చేర్చే కార్య క్రమాన్ని చేపట్టారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని పలు రైళ్లు దాదాపు గంటపాటు ఆల స్యంగా నడిచాయి.