ప్ర‌ధాని మోదీ నివాసం వ‌ద్ద టిడిపి ఎంపీల నిర‌స‌న.. అరెస్ట్‌

TDP MP;s
TDP MP;s

న్యూఢిల్లీః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి న్యాయం చేయాలంటూ ఢిల్లిలో ప్రధాని ఇంటి వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో టీడీపీ ఎంపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రధాని ఇంటి ముందు రోడ్డుపై పడుకొని మాగంటి బాబు నిరసన తెలిపారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదంటూ స్వామివారి ఫొటోతో మాగంటిబాబు నిరసన తెలిపారు.