ప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల‌కేం చేశారుః మంత్రి లోకేష్‌

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదంటూ వైకాపా ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. వారి ఆరోపణలపై వాస్తవ ప్రతిని ట్విటర్‌లో విడుదల చేశారు. మీపై నమ్మకంతో ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో గెలిపించారని, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మీరు ప్రజలకు తిరిగి ఏమిచ్చారని వైకాపా ఎమ్మెల్యేలను ఆయన నిలదీశారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టారని, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగిందే లేదని మండిపడ్డారు. జీతాలు మాత్రం తీసుకొని అన్ని సౌకర్యాలు పొందుతున్నారన్నారు. తమకు రాష్ట్రాభివృద్ధే అజెండా అని.. ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామని లోకేశ్ తెలిపారు. వైకాపా ఎమ్మెల్యేలు అడగకపోయినా వారి నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.