ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గా కృషిః మంత్రి ప‌ల్లె

Palle Raghunath reddy
Palle Raghunath reddy

అమరావతి: మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై లోతుగా చర్చించాలని…రాష్ట్రంలో నెలకొన్న కరువు, తాగునీరు, రోడ్లు, విభజన చట్టంలో కేంద్రం నెరవేర్చాల్సిన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రజలకు, ప్రతిపక్ష సభ్యులుకు ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. మండలి, శాసనసభ విప్పులతో పల్లె సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అధికారులు కూడా అన్ని శాఖల అభివృద్ధి, ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. క్వశ్చన్ అవర్ లో చర్చకు ఎంఎల్ఏ లు 300 క్వశ్చన్స్‌ ప్రదిపాదించగా…లాటరి ద్వారా 120 క్వశ్చన్స్‌ కు సమాధానాలు రాబట్టారు. చర్చకు వచ్చే అంశాలపై శాఖల వారిగా నివేదికను సిద్ధం చేసే బాధ్యత ను విప్పులకు అప్పగించారు. సమావేశాలకు ఎమ్యెల్యేలందరు వందశాతం హాజరయ్యేలా చూస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తో సమావేశమై సలహాలు సూచనలు తీసుకుంటామని చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.