ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వా?

Botsa Satyanarayana
Botsa Satyanarayana

గుంటూరులో అతిసార వ్యాధి ప్రబలి పది మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం వస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అతిసార వ్యాధికి పది మంది మృతి చెందిన సంఘటనలో కింది స్థాయి అధికారులను బలిపశువులను చేయడం కాదని, సంబంధిత మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు, కార్యదర్శులు ఉండే ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలినా ప్రభుత్వం పట్టించుకోదా? ఎంత సేపూ ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించేనా ఆలోచించేది? ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని బొత్స ప్రశ్నించారు.