ప్రభుత్వ భరోసాతో తిత్లీ బాధితుల్లో చిగురాశలు

Titly
Titly

ప్రభుత్వ భరోసాతో తిత్లీ బాధితుల్లో చిగురాశలు

సిఎం చంద్రబాబు పలాసలో బస్సులోనే బస
మండలానికో మంత్రి, ఐఏఎస్‌ అధికారి నియామకం

అమరావతి: తిత్లీ తుఫాన్‌ సృష్టించిన పెను విలయం ఉండి సర్వస్వం కోల్పోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనేఇ కొన్ని ప్రాంతవాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలాసలో బస్సులోనే రోజుల తరబడి బస చేస్తూ తుఫాను బాధితులకు నేనున్నానంటూ ఓదార్చారు.

సిఎం స్వయంగా యుద్ధప్రాతిపిదికన నష్టనివారణచర్యలు చేపట్టడంతో బాధితుల్లో భవిష్యత్తుపై చిగురాశలు చిగురిస్తున్నాయి. మంత్రులు లోకేష్‌, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులతో పాటు 100 మంది డిప్యూటి కలెక్టర్లు, 40 మందిఐఏఎస్‌ అధికారులు, వందాలది మంది పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ వైద్య ఆరోగ్యశాఖ, రూరల్‌ వాటర్‌ సప్ల§్‌ు,పశుసంవర్ధక శాఖ , ఉద్యానవనశాఖ, విద్యుత్‌శాఖ, అగ్నిమాపక ఉద్యోగులు తుఫాన్‌ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారితోపాటు స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిథులు, వలంటీర్లు, రేయింబవళ్ళు శ్రమిస్తూ తిత్లి మిగిల్చిన విధ్వంసం తాలుకు శిథిలాలను తొలగిస్తున్నారు. ఒకవైపు బాధితులకు ఆకలిదప్పికలు తీరుస్తూ, మరోవైపు తుఫాను వల్ల కలిగిన నష్టాలను పరిహారాలు అందజేయడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. రాకపోకలకు రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లు తొలగింపు, విద్యుత్‌ స్థంభాలను తిరిగి నిలబెట్టడంకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ రవాణా వ్యవస్థ 100 శాతం మెరుగైంది.

విద్యుత్తును విజయనగరం జిల్లాలో పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో 91శాతం మేర టెలికాం సేవలందిస్తున్నారు. శ్రీకాకుళంలో 58శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్దరించారు. తుఫాన్‌ వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రు.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మృతిచెందిన పశువులు, గొర్రెలు, మేకలకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. కూలిపోయిన ఇళ్ళ స్థానంలో కొత్త ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆర్ధిక సహాయం చేయనుంది. పశువుల పాకల నిర్మాణానికి కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభించింది. పరిశుద్దమైన తాగునీటి సరఫరాకు పంపిణీకి చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా 1,99,318 క్లోరిన్‌ మాత్రలను పంపిణీ చేసింది. నిత్యావసరాలను ఉచితంగా అందజేసింది. దీంతో తిత్లి తుఫాను భాదితుల్లో మనోనిబ్బరం, భవిష్యత్తుపై ఆశ కలుగుతున్నాయి. వరి, అరటికి రు.20వేలు, జీడి మామిడికి రు.25వేల చొప్పున, కొబ్బరి చెట్టుకు రు.1200ల చొప్పున పంట నష్టాన్ని ప్రభుత్వం అందిస్తామని పేర్కొంది. ఆర్‌టిసితో పాటు రైల్వే సేవలన్ని పునరుద్దరించారు.