ప్రపంచ ఫోటోగ్రఫీ డే అవార్డులు

Ap photo jounalists met  Cm
Ap photo jounalists met Cm

అమరావతిప్రపంచ ఫోటోగ్రఫీ డే అవార్డులు బహూకరించిన ముఖ్యమంత్రి

అమరావతి : పత్రికా రంగంలో ఛాయాచిత్రాలు ముఖ్యభూమిక పోషిస్తాయని,గతానికి,వర్తమానానికి, భవిష్యత్తుకి వారధిలాంటివని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 179 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంద్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్,రాష్ట్ర పర్యాటక శాఖ,సాంస్కృతిక శాఖ, క్రీడల శాఖ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఫోటో పోటీలను నిర్వహించడం జరిగింది. 3 కేటగిరీలలో పోటీలు నిర్వహించగా 80 ఎంట్రీలకు గాను 500 ఫోటోలు పోటీపడ్డాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకులు, జేఎన్టీయూ ఫోటోగ్రఫీ విభాగ అధిపతి,పర్యాటక శాఖ ప్రతినిధి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.

మొదటి కేటగిరి అంశం నేచర్ అండ్ లాండ్ స్కేప్, 2వ అంశం ఫోక్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్, 3వ అంశం బెస్ట్ న్యూస్ పిక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మూడు కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకోసం 9మందిని ఎంపిక చేయడం జరిగింది. కన్సోలేషన్ బహుమతులుగా 3 కేటగిరీలలో 15 మందిని ఎంపిక చేయడం జరిగింది. విజేతలందరికి సోమవారం ఉండవల్లి ప్రజా వేదికలో జరిగిన సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు బహుమతులు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రిని గజ మాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కాలవ శ్రీనివాసులు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, ఏపీ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు, అసోసియేషన్ నాయకులు ఎన్.వి.ఎస్.చలపతి రావు, సుమన్ రెడ్డి, విజయ భాస్కర్, రమణ, ఆనంద్, మరీడయ్య, వివిధ పత్రికల ఫోటోగ్రాఫర్లు …