ప్రత్యేక హోదాపై స్పష్టత ఉంటుంది

rrrrFFF

ప్రత్యేక హోదాపై స్పష్టత ఉంటుంది
గుంటూరు: సిఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనతో ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. టిడిపి మిత్రపక్షమన్న విషయం భాజపా గుర్తుంచుకోవాలన్నారు. భాజపా నేతలు పరిధి దాటి మాట్లాడవద్దని అన్నారు. కేంద్రం స్పందనను అనుసరించి తమ స్పందన ఉంటుందన్నారు.