ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

apcc president raghuveera reddy
apcc president raghuveera reddy

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీని అదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని,
అలాగే నంద్యాల ప్రజల తీర్పును గౌరవిస్తామని, ముందస్తు కార్యాచరణతో పనిచేస్తామని, అధికారంతో సంబంధం
లేకుండా తమ పార్టీని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని, ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని
ముందస్తు కార్యాచరణ వేసుకొని పనిచేస్తామని తెలిపింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేరుతో సోమవారం
విడుదలైన పత్రిక ప్రకటనలో పై విషయాలను వెల్లడించింది.