పోల‌వ‌రం పాద‌యాత్ర‌కు స‌న్న‌హాంః ఏపిసిసి

Congress Party
APCC

విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్‌కు గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి తొమ్మిదో తేదీ వరకు ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రకు సిద్దమవుతున్నట్లు నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు. నగర కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆంధ్రరత్న భవన్‌లో పోలవరం పాదయాత్ర పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ఆరువందలు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు ప్రజా వ్యతిరేకవిధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన పాదయాత్రకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అధికారం కోసం పాదయాత్ర చేస్తుంటే రాష్ట్ర ప్రజల బాగోగులను కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ పోలవరం పాదయాత్ర చేపట్టిన్నట్లు ఆయన వివరించారు. నగరం ట్రాఫిక్‌ మయంగా మరిందని దుర్గగుడి వద్ద నిర్మాణంలో ఉన్న కనకదుర్గ పైవంతెనను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో భాగంగా విలేఖరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా దుర్గగుడి పాలకవర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏపిసిసి ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజి, వి.గరునాధం, నిమ్మల జ్యోతికా, వెన్న రమేష్‌, నగర నాయకులు చంటిబాబు, శ్రీలక్షి తదితరులు పాల్గన్నారు.