పోల‌వ‌రంపై కేంద్రానికి లేఖః బిజెప ఎమ్మెల్యే

Vishu kuar
Vishnu kumar
అమరావతి: పోలవరంపై కేంద్రం వైఖరిని సమర్ధించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం పంపిన లేఖ టెక్నికల్‌ అంశమని విష్ణుకుమార్‌ రాజు తెలియజేశారు. లేఖకు జవాబు ఇస్తే సరిపోతుందని ఏబీఎన్‌తో విష్ణుకుమార్‌ రాజు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆగదు.. పోలవరం పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు.   ఏపీకి అన్యాయం జరగాలని నేను కోరుకోనని.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని విష్ణుకుమార్‌ రాజు వెల్లడించారు. విభజన సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని విష్ణుకుమార్‌ రాజు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు 60 ఏళ్ల కల అని ఏబీఎన్‌తో బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు వెల్లడించారు.