పోలీస్‌లకు కులం లేదు తమది ఖాకీ కులం

ap dgp takur
ap dgp takur

తిరుపతి: తిరుపతిలో ఈరోజు ఆరు రాష్ట్రల పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపి, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా చత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్‌ ఎన్నికల భద్రతా విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. అంతేకాక మావోయిస్టుల కదలికలు, పోలీస్‌ సిబ్బంది తరలింపుపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూపోలీసులకు కులం లేదని, తమది ఖాకీ కులం అని అన్నారు. డ్యూటీలో చేరిన రోజే కులాన్ని పక్కన పెడుతామని ఆయన స్పష్టం చేశారు.తన కులం ఇక్కడ ఎక్కడా లేదని, నిజాయితీగా పనిచేస్తున్నానని, డీజీగా ఉన్నప్పటి నుంచి అందరికీ తెలుసునని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారుహైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్లపై జ్యుడీషియల్‌ స్క్రూటినీ ఉంటుందని, ఈసీ నుంచి రాత పూర్వకంగా వస్తే రిప్లే ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.