పోరాటం ఉధృతం చేస్తాం

Rammohan naidu
Rammohan naidu

న్యూఢిల్లీ: ఏపిని దేశంలో ఒక రాష్ట్రంగా చూడటం లేదని, అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపి రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గాల్సిన అవసరం తమకు లేదని, సస్పెండ్‌ చేసినా వెనకాడబోమని హెచ్చరించారు. బడ్జెట్‌ సమావేశాల రోజున తమ ప్రతిఘటన ఉంటుందని ఆయన తెలిపారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీఏకు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అర్హత ఎక్కడుందని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.