పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు

AP DGP Nanduri Sambasiva Rao
AP DGP Nanduri Sambasiva Rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌ డీజీపీగా కొనసాగుతున్న నండూరి సాంబశివరావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న సాంబశివరావు మరో నెల రోజుల్లో రిటైర్‌ కానున్నారు. అయితే ఇన్‌చార్జ్‌ డీజీపీగా రిటైర్‌ అవడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం ఆయనకు పూర్తిస్థాయి బాద్యతలు అప్పగించినట్లు సమాచారం.