పిడుగులు ప‌డే అవ‌కాశం, అప్ర‌మ‌త్తంగా ఉండాలి

THUNDER
THUNDER

కృష్ణాః జిల్లాలోని పలు ప్రాంతాలకు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాట్రాయి, విసన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, వత్సవాయి, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు నందిగామ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.