పిచ్చి కుక్క దాడిలో చిన్నారులకు గాయాలు..

DOGF
Dog

గుంటూరు: చిలుకలూరిపేటలో మదర్‌థెరిసా కాలనీలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈ కుక్క దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనేస్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల ఇంటిలో నుంచి బయటకు రావాలంటే తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. పిచ్చి కుక్కలను గ్రామంలో నుంచి తరలించాలని గ్రామస్థులు వాపోతున్నారు.