పార్ల‌మెంటులో టిడిపి ఎంపీల ఆందోళ‌న

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీః ఢిల్లీలో పార్లమెంటు బయట, లోపల టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఈరోజు కూడా ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, విశాఖకు రైల్వే, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయపరంగా కూడా పోరాడతామని ఎంపీలు తెలిపారు.