హామీలపై టిడిపి ఎంపీల ఆందోళన

tdp mp's
tdp mp’s

న్యూఢిల్లీ: విభజన హామీలపై టిడిపి ఎంపిలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు నిరసర వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఏపిని అశాస్త్రీయంగా విభజించారని ఎంపి అశోక్‌ గజపతి రాజు మండిపడ్డారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.