పార్లమెంటు ఆవరణలో టిడిపి ఎంపీల రభస

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీ: ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ప్రాంగణంలో టిడిపి ఎంపీలు నిరసనకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీలు నినాదాలు చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండఖ చేశారు. మరికాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరాటం చేయాలని, విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయాలని ఎంపీలకు సియం దిశానిర్దేశం చేశారు.