పాఠ‌శాల విద్యార్థినీపై అత్యాచారం

Sexual abuse
Sexual abuse

పశ్చిమగోదావరి:  జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతలపూడిలోని బాలికల ఎస్సీ వసతి గృహంలో ఉంటూ పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై(15) ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పెదవేగి మండలానికి చెందిన మైనర్‌ బాలిక స్థానిక బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మీద బెంగతో ఈ నెల 16న పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చిన బాలికకు పెదవేగి మండలం కవ్వకుంట గ్రామానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి తారసపడ్డాడు. ఇతడు బాధితురాలికి మాయ మాటలు చెప్పి స్థానికంగా ఉన్న ఓ కళాశాలకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాధితురాలిని సొంత గ్రామానికి తీసుకెళ్లాల్సిందిగా తన స్నేహితుడు చిట్టి బాబుకు అప్పగించాడు. చిట్టిబాబు ఏలూరులోని తన బంధువుల ఇంట్లో ఉంచి పది రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందడంతో ఏలూరులోని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన అనంతరం ఈ కేసును చింతలపూడి పోలీసులకు అప్పగించారు.