పవన్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలి

AP Minister Somireddy
AP Minister Somireddy

విజయవాడ: పవన్‌ కోనసీమలో చేస్తున్న కవాతును విమర్శిస్తూ కవాతుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఓ వైపు అహింసావాదిని అని చెప్పుకునే పవన్‌, మరోసారి దెబ్బకు దెబ్బ తియ్యాలని అంటారని విమర్శించారు. సియంపై ఆశ లేదని ఒకసారి, మరోసారి సియం కావాలంటారని మంత్రి దుయ్యబట్టారు. తిత్లీ తుఫానుతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే కవాతుకు నిధులు ఎక్కడినుండి వచ్చాయని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ కుమారుడు సియం కాకూడదాఅని పవన్‌ ప్రశ్నించారని …ఛా§్‌ువాలాగా ఉన్న మోది ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పవన్‌ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.