పవన్‌పై మండిపడ్డ రామ్మోహన్‌నాయుడు

Rammohan naidu
Rammohan naidu

అనంతపురం: జనసేన అధినేత పవన్‌ను ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ఏపిపై కేంద్ర వైఖరికి నిరసనగా టిడిపి ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పవన్‌ను ఉద్దేశించి రామ్మోహన్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పవన్‌ ఏం మాట్లాడతారో క్లారిటీ ఉండదని ఆరోపించారు. జగన్‌, పవన్‌, బిజెపి ఏకమై సియం చంద్రబాబును గద్దె దించేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో ఉన్న తెలుగువారెవరూ బిజెపికి ఓటేయలేదని, జిఎస్టీతో సామాన్యుడిపై పెనుభారం మోపారని రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. ప్రధాని మోదికి ఎన్నికల ఆలోచనే తప్ప అభివృద్ది ఆలోచన లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు ఆదర్శంగా తీసుకునేలా పోరాడుతామని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.