పనితీరు బట్టే పదవులు

 

lokesh at computer traiing lab
Lokesh Visits Computer Training Lab held at TDP Workshop in KL University near Mangalagiri

పనితీరు బట్టే పదవులు

నేనేమీ అతీతుడ్ని కాను

కార్యకర్తలను పట్టించుకోని నేతలను పార్టీ పట్టించుకోదు

పార్టీకోసం పనిచేసినవారికి పెన్షన్లు, పిల్లలకు చదువులు, వృత్తిశిక్షణ

-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌

 

మంగళగిరి (గుంటూరుజిల్లా):  తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలను పట్టించుకోని నాయకులను తెలుగుదేశం పార్టీకూడా పట్టించుకోదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెదేపా నేతలకు స్పష్టంచేశారు.గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మూడురోజుల పాటు జరుగుతున్న తెదేపా మేధోమదన సదస్సుకు మూడవరోజు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులకు,మంత్రులకు,ఎమ్మెల్యేకు భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు.అనంతరం మాట్లాడుతూ తెదేపా కార్యకర్తల సంక్షేమానికి పార్టీ తీసుకుంటున్న వివిధ పథకాలను,చర్యలను ఈ సందర్భంగా వివరించారు.నాయకుల పనితీరును పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉందని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే,ఎంపి,ఎమ్మెల్సీలు పార్టీ అధ్యక్ష కార్యదర్శుల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదికలు చేరుతున్నాయని తెలిపారు.తెలుగుదేశం పార్టీలో తనతో సహా ఎవరికైనా పనితీరును బట్టే పదవులు వస్తాయని అలాగే సీట్ల కేటాయింపులు ఉంటాయని ఆయన స్పష్టంచేశారు.ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేతలు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేతలకు పిలుపునిచ్చారు.పార్టీకోసం నిరంతరం శ్రమించిన వారికి పెన్షన్లు,కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్‌ స్కూల్స్‌లో సీట్లు,వృత్తి నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ ఉద్యోగాలను కల్పించనున్నట్లు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. వచ్చేనెల నుండి తెదేపా కోర్‌ డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయనున్నారని అలాగే జాతీయ అధికార ప్రతినిధులు సీనియర్‌ నేతలు,టివీ డిబెట్లు చర్చలకు వెళ్ళాల్సిందిగా పార్టీ ఆదేశాలు జారీచేసింది.టిడీపీ పార్టీ పదువులపై టీడీపీ సంచలన ప్రకటన చేసింది.ఇకపై పార్టీలో ఒకవ్యక్తి ఒకే పదవిలో ఉండాలని ఈ మేరకు 2016 తెదేపా మేధోమధన సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మృతిచెందిన కార్యకర్తలకు త్రికరణశుద్ధితో నివాళి అనే పుస్తకాన్ని మూడవరోజు రాజకీయ శిక్షణా తరగతుల సదస్సులో ఆవిష్కరించారు.ఈ పుస్తకంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించిన కార్యకర్తల వివరాలు పార్టీ తరపున వారి కుటుంబాలను పార్టీ ఆదుకున్న తీరును తెలిపే విధంగా వివరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడవరోజు తెదేపా మేధో మదన సదస్సులో ప్రధానంగా నాయకత్వ లక్షణాలు,సాధికారత,కార్యకర్తల సాధకబాధలు,సంక్షేమ సాధికారత అనే అంశాలపై ప్రదాన చర్చ జరిగింది.నియోజకవర్గాల్లో రాజకీయ ఏకీకరణ,పార్టీ వ్యూహంపై కీలక చర్చ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 3వరోజు ప్రధాన ఆకర్షణగా లోకేష్‌ మూడురోజుల తెదేపా మేధోమధన సదస్సులో మూడవరోజు రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రాజకీయ శిక్షణా తరగతుల్లో తెదేపా నేతలకు నారా లోకేష్‌ భవిష్యత్‌ ప్రణాళికలను వివరిస్తూ సాంకేతిక పరమైన నైపుణ్యానికి సంబంధించిన అంశాలపట్ల నేర్పుగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శిక్షణా తరగతులకు హాజరు కాలేదు.వైజాగ్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 3గంటల ప్రాంతంలో హెలీకాప్టర్‌లో కె.ఎల్‌ యూనివర్సిటీలోని రాజకీయ శిక్షణా తరగతుల ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం శిక్షణా సదస్సులో పాల్గొని సుమారు 4గంటలపాటు సుదీర్ఘంగా పార్టీనేతలు,ఎంపిలు,ఎమ్మెల్యేలతో పార్టీ భవిష్యత్‌ ప్రళాణికను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరవేసే విధానం వంటి అంశాలపై చర్చించారు.అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో మూడురోజులపాటు తమ పార్టీ మేధోమధన సదస్సు జరుపుకునేందుకు ఆతిధ్యం ఇచ్చిన కోనేరు విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు రాజాహరిన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టిడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను వర్సిటీ విద్యార్థులు ఉపాధ్యాయులు,ప్రొఫెసర్స్‌్‌తో ఫోటోలు దిగారు.అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నారా లోకేష్‌ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప,తదితరులు పాల్గొన్నారు.