నేను హిందువునే… సందేహాం లేదు: పుట్టా సుధాకర్‌

Putta Sudhakar Yadav
Putta Sudhakar Yadav

మైదుకూరు(కడప): తితిదే నూతన ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను నియమించడాన్ని తాళ్లాయపాలెం శైవక్షేత్రం
పీఠాధిపతి శివస్వామి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విధితమే. దీనిపై సుధాకర్‌ యాదవ్‌ స్పందిస్తూ, తాను
తాను హిందువేనని, క్రైస్తవ సంస్థలకు తాను మద్ధతు ఇస్తున్నానని చెప్పడం అవాస్తవమని అన్నారు. పీఠాధిపతులంటే
తనకు గౌరవమని, హిందూధర్మ కొసం తాను పాటుపడుతున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ
ఆహ్వానిస్తారనరి, కార్యకర్తల పిలుపు మేరకు ఆయా కార్యక్రమాలకు హాజరు కావడం సహాజమని అన్నారు. కార్యకర్తలు
ఏర్పాటు చేసుకున్న బ్యానర్లతో ఎటువంటి సంబంధం లేదని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కూడా దేవాలయాల నిర్మాణానికి
తితిదే బోర్డు సభ్యుడిగా నిధులు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.