కోడెల శివప్రసాద్‌పై వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడి

Kodela Siva Prasad Rao
Kodela Siva Prasad Rao

గుంటూరు: ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి పార్టీ నాయకులు గంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి చేశారు. స్పీకర్‌ కోడెల చొక్కా చింపేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/