నేడు తొమ్మిదో శ్వేతపత్రం విడుదల

chandrababu
chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఏపి అభివృద్ధిపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 8 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఈరోజు తొమ్మిదో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై చంద్రబాబు ఎనిమిదో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో రూ. 55 వేల కోట్లు, పట్టణాల్లో రూ. 77 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 26 వేల కోట్లు నరేగా నిధులను వినియోగించామన్నారు. రూ.5, 694 కోట్లతో 23, 553 కి.మీ సీసీ రోడ్ల నిర్మించామన్నారు. సీసీ రోడ్లకు ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల వినియోగించామని చంద్రబాబు తెలిపారు. 8 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.