నీరు-ప్ర‌గ‌తిపై సియం టెలికాన్ఫ‌రెన్స్‌

AP CM BABU
AP CM BABU

అమ‌రావ‌తిః నాలుగేళ్లలో చేసిన పనులు సత్ఫలితాలనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … ఈ ఏడాది రాష్ట్రానికి 60పైగా అవార్డులు రావడం గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాలకు సగటున 20-30 అవార్డులే వచ్చాయని తెలిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, జలవనరులు, ఐటి శాఖల్లో అనేక అవార్డులు వచ్చాయని, అవార్డులు సాధించిన అందరికీ త్వరలోనే అభినందన సత్కారం ఉంటుందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో అన్ని శాఖలు ఒకదానితో మరొకటి పోటీ పడాలని సూచించారు. రెండంకెల వృద్ధిరేటు కొనసాగాలని..15% వృద్ధిరేటు సాధించాలని సీఎం ఆదేశించారు.