నితిన్ గ‌డ్క‌రీతో చంద్ర‌బాబు భేటీ

AP CM Chandrababu Naudu
AP CM Chandrababu Naudu

ఢిల్లీః కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో సమస్యలు, కొత్త టెండర్లు, ప్రాజెక్టు పనుల పురోగతి వంటి పలు అంశాలపై గడ్కరీతో చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో మంత్రి దేవినేని ఉమ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ని చంద్రబాబు కలిశారు. బాబు వెంట ఎంపీలు సుజనా చౌదరి, తోట నర్సింహం ఉన్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణించారు.