నంద్యాల‌లో 20వేల మెజారీటి వ‌స్తుందిః మంత్రి కాల్వ‌

kalva srinivasulu
kalva srinivasulu

అనంతపురం: త‌మ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి నంద్యాల ప్రజలు త‌మ పార్టీకి బ్రహ్మరథం
పట్టారని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థికి 20వేల ఓట్ల మెజారిటీ
వస్తుందని, ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా పాల్గొనడం తెదేపాకు బాగా కలిసొచ్చే అంశంమని,
నంద్యాల ప్రజలు జగన్‌కు ఓటుతో చెంపదెబ్బ కొట్టారని ఆయ‌న నంద్యాల ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన
తీరుతో ప్రతిపక్ష నేతగా కొనసాగడానికి అర్హత కోల్పోయారని విమ‌ర్శించారు.