ద‌మ్ముంటే జ‌గ‌న్, మోది ఇంటి ముందు ధ‌ర్నా చేయాలిః జివి

GV ANJANEYULU
GV ANJANEYULU

గుంటూరుః ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే అరెస్ట్ చేయించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకున్న జగన్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మోదీని ప్రశ్నించడానికి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే మోదీ ఇంటిముందు జగన్ ధర్నా చేయాలని ఆంజనేయులు సవాల్ విసిరారు.