దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ప‌రిపూర్ణానంద‌

Paripurnanda swamy
Paripurnanda swamy

విజయవాడ: చట్టాలు కఠినంగా ఉన్నప్పుడే మతంపై, సంస్కృతిపై ఇష్టారాజ్యంగా దాడులు జరగవని కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు, అధికారులు స్వామిజీకి సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడారు. కత్తి మహేష్ ఇప్పటికైనా రాముడి గురించి తెలుసుకోవటం సంతోషంగా ఉందన్నారు. హిందూ సంప్రదాయం గురించి, విలువల గురించి తెలియజేసేలా విద్యావ్యవస్థలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వ్యాఖ్యానించారు. తనని, కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి పోలీసులు బహిష్కరించటాన్ని స్వామిజీ తప్పుబట్టారు.