దళితుల సంక్షేమమే లక్ష్యం

AP MINISTER SIDHA
AP MINISTER SIDHA

దళితుల సంక్షేమమే లక్ష్యం

దర్శి,: దళితుల సంక్షేమా నికి, అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు ఎంతో కృషి చేస్తున్నారని, తెలుగుదేశం పాలనలోనే దళితుల అభివృద్ది జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీ దళితుల్ని విస్మరించిందని, వారికి న్యాయం జరుగలేదని, పేదరికం లేని సమాజం కావాలని ముఖ్యమంత్రి ఆశయంగా పాలన సాగి స్తున్నారని, దళితుల సమస్యలను వారి గ్రామా ల్లోనే తెలసుకుని, అక్కడే పరిష్కరించేందుకే టిడిపి నాయకులు గ్రామాలకు వచ్చి, తెలుగు దేశం- దళితతేజం కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రని, రాష్ట్ర అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకే తిక శాఖల మంత్రివర్యులు శిద్దా రాఘవరావు పేర్కొన్నారు.

మండలంలోని తూర్పు వీరాయ పాలెం గ్రామంలో జిల్లా దళిత నాయకులు జోసఫ్‌, మోషే, తానంచింతల లింగయ్యల పర్యవేక్షణలో తెలుగుదేశం-దళితతేజం కార్యక్ర మం జరగ్గా, ముఖ్య అతిధిగా మంత్రి శిద్దా రాఘవరావు పాల్గొని, తొలుత చర్చిలో ప్రార్ధ నలు చేసి, తదుపరి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం సభలో మంత్రి మాట్లాడుతూ దళి తుల సంక్షేమం కోసం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా బ్యాంక్‌ రుణాలను ఇప్పించి, వారిని ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు అలాగే ఉన్నత చదువులకై ఆర్ధిక సహాయం కల్పించడంతో పాటుగా పక్కా గృహాలను కట్టించడం, దళిత వాడల్లో రోడ్లను అభివృద్ది చేయడం, అన్నీ విధాలుగా వసతులు కల్పించి, అభివృద్ది పనులు చేస్తున్నట్లు తెలి పారు. దర్శి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు రూ.1750 కోట్లతో జరిగాయని, దోర్నపు వాగుపై వంతెన నిర్మించడం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిందని, అలాగే వీరాయ పాలెంలో కోట్లాధి రూపాయలతో జరిగిన అభి వృద్ది పనులను తెలిపారు. కురిచేడులో రూ. 30కోట్లతో ఎస్సీ బాలికల చదువుల కోసం రెనిడె స్షియల్‌ స్కూల్‌ నిర్మాణం జరుగుతుం దని తెలిపారు.