త్వరలో 25వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు

anand babu
anand babu

త్వరలో 25వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు

త్వరలో 25వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి ఆనందబాబు తెలిపారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరంలో మంత్రి పర్యటించి చేనేత కార్మికులకు నూలు ఖాతా పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ…వస్త్రాలు, నూలుపై జీఎస్టీ, కార్మికుల ఇబ్బందులను సీఎం దృష్టికి తెస్తామన్నారు. చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత క్లస్టర్ల ద్వారా ఆధునిక డిజైన్ల రూపకల్పనకు శిక్షణ ఇప్పిస్తామన్నారు.