త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటన: పవన్‌

PAWAN KALYAN
PAWAN KALYAN

అమరావతి: తెలంగాణ సియం కేసిఆర్‌తో తాను సన్నిహితంగా ఉంటే తప్పేముందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నపుడు లేని తప్పు ఇపుడు వచ్చిందా అని అన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే సభలో ఏపి ,తెలంగాణల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటస్తామని చెప్పారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఉద్దేశించి మాట్లాడుతూ.. 2019లో నేను సియం అని చెప్పుకుంటే ప్రజలు చేసేస్తారా?అని ప్రశ్నించారు.