ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్ ప‌రిశీల‌న‌

TASK FORCE
TASK FORCE

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేది లేదని నిన్న సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు దీనిపై కేంద్ర సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణల్లోని ఆయా ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తోందని తెలిపింది.
మరోవైపు, కడపకు ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ, కాంగ్రెస్‌లు మండిపడుతూ నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు నాన్చుడు ధోరణీతో వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి.