తెలుగు రాష్ట్రాల‌కు పెళ్లి క‌ళ

marraige
marraige

హైద‌రాబాద్ః ముహూర్తాలు బలంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఒకేసారి లక్ష జంటలు మూడు ముళ్ల బంధంతో ఏకమవుతున్నాయి. దీంతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ సహా అన్నింటికీ డిమాండ్ భారీగా పెరిగింది. అదే అదునుగా భావించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మార్గశిర మాసం వస్తూ వస్తూ..రాష్ట్రానికి పెళ్లి కళ తెచ్చింది. ఈ నెల 23,24,25వ తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో సందడి నెలకొంది. కార్తీక, మార్గశిర మాసాలు అత్యంత ప్రవిత్రమైనవి. పెళ్లి మొదలైన శుభకార్యాలు ఎక్కువగా ఈ మాసాల్లోనే చేస్తారు. ఇక ఈ నెల 23 నుంచి 28 వరకూ మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చేసినా కళ్యాణ కాంతులే కన్పిస్తున్నాయి. ముమూర్తం దాటితే మళ్లీ ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందే.