తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణం

Tirumala temple
Tirumala temple

తిరుమ‌లః తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 09 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతున్నది. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. నిన్న స్వామి వారిని 68,690 మంది దర్శించుకున్నారు. 24,239 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.87కోట్లు.