‘తిత్లీ’ బాధితులకు సాయం చేసిన తారక్‌, కల్యాణ్‌రామ్‌

jr ntr, kalyanaram
jr ntr, kalyanaram

హైదరాబాద్‌:తిత్లీ తుపాను  బాధితులకు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సాయం చేసి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. తుపాను బాధితుల కోసం తారక్‌ రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి. గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్‌ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.