తిత్లీ బాధితులకు సచివాలయ ఉద్యోగుల సాయం

TITLI
TITLI

అమరావతి: తిత్లీ తుఫాను బాధితులకు ఏపి సచివాలయ ఉద్యోగులు అండగా నిలిచారు. తుఫాను బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. సచివాలయంలో 3,4 తరగతుల ఉద్యోగులు రూ.500 చొప్పున విరాళం ప్రకటించారు. అదే విధంగా ఎఎస్‌ఓలు, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు రూ.1000 చొప్పున ,ఎస్‌ఓలు, గెజిటెడ్‌ ఉద్యోగులు రూ.1500 చొప్పున, అదనపు, డిప్యూటి కార్యదర్శి, గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగులు రూ. 2 వేలు చొప్పున విరాళాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాదాపు 1500 మంది ఉద్యోగుల రూ.25 లక్షల మేర సాయం అందిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.