తిత్లీ ధాటికి ఇద్దరు మృతి

titli
titli

శ్రీకాకుళం: జిల్లాలో తిత్లీ తుఫాను పెను భీబత్సం సృష్టిస్తోంది. బలమైన గాలుల ధాటికి చెట్లు, పూరిండ్లు, గుడిసెలు నేలమట్టమవుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వంగర మండలంలోని ఓని అగ్రహారంలో చెట్టు విరిగి అప్పలనర్సయ్య(62) మృతిచెందగా, సరుబుజ్జిలి మండలంలో ఇల్లు కూలి సూర్యారావు (55) మృతి చెందాడు.