తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సిపి వర్గాల మధ్య రగడ

ysrcp
ysrcp


అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సిపికి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడులకు కారణం స్థలవివాదం లో చోటుచేసుకున్న గొడవ చివరకు కర్రలు, రాడ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. రాయలసీమ ఉద్యమనేత నాగార్జునరెడ్డి తనకున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. ఐతే ఆ పక్కనే ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నేత జగదీశ్వర్‌రెడ్డి కట్టుకోవడానికి వీల్లేదంటూ బెదిరించారు. దీంతో నాగార్జున రెడ్డికి మద్దతుగా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కొందరు దాడి చేశారు. పోలీసులు సకాలంలో రాకపోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఇరు వర్గాలకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/